Hyd Metro : 1 Lakh People Travel On The First Day | Oneindia Telugu

2017-11-30 247

Approximately 1,00,000 people travelled on the metro rail on the first day of commercial operations. The huge response took the operators by surprise and they struggled to cope with the load.

ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూసిన నగర ప్రజలు.. ప్రారంభమైన రోజు నుంచే మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. బుధవారం రోజు మెటో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా మెట్రో ప్రారంభమైన విషయం తెలిసిందే.
కాగా, బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో స్టేషన్లు, మెట్రోరైళ్లన్నీ ప్రయాణికులతో సందడిగా కనిపించాయి. మెట్రో కారిడార్‌ ప్రారంభ స్టేషన్లయిన నాగోల్‌, ఉప్పల్‌, మియాపూర్‌, అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లు రోజంతా ప్రయాణికుల ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేశారు.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకే హైదరాబాద్‌ మెట్రోలో 50 వేలమంది ప్రయాణించారని, మెట్రో అధికారులు తెలిపారు. అయితే, ఆ సంఖ్య రికార్డు స్థాయిలో లక్ష దాటిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘మెట్రోలో తొలిరోజు లక్షమందికి పైగా ప్రయాణించారు. మెట్రోని నగరవాసులు పెద్ద ఎత్తున స్వాగతించడం ఆనందాన్ని కల్గించింది'అని మంత్రి కేటీఆర్‌ బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు.
పలువురు కుటుంబసమేతంగా మొదటిసారి మెట్రో రైలులో ప్రయాణించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని యువత తొలి మెట్రో ప్రయాణ అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.